Gurumurthy: కూటమి నాయకులపై ఎంపీ గురుమూర్తి ఫైర్ 7 d ago

AP : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు వైసీపీ ఎంపీ గురుమూర్తి. ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని, రాష్ట్రంలోని మహిళలు తాము మోసపోయామని ఆందోళన చెందుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో కూడా కూటమి నాయకులు విఫలమయ్యారని, పోలవరం ఎత్తు తగ్గిస్తున్నా, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తాం అని చెబుతున్నా మాట్లాడకపోవడం దారుణమన్నారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మొండి చేయి చూపిస్తున్నా టీడీపీ ఎంపీలు మాట్లాడటం లేదని, వైసీపీ నేతలపై బురదజల్లడానికి మాత్రమే తెలుగు దేశం పార్టీ వాళ్ల ఎంపీలను ఉపయోగిస్తుందన్నారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతి చేశారని ఆధారాలు ఉన్నాయని ఈడీ, ఐటీ కూడా ధ్రువీకరించాయన్నారు. వీటిపై టీడీపీ ఎంపీలు లోక్ సభలో మాట్లాడాలన్నారు. కూటమి నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, మిథున్‌రెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి లిక్క్‌ర్ స్కామ్‌తో సంబంధం లేదన్నారు. పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని వాళ్లని ఇబ్బందులు పెడుతున్నారని, గత టీడీపీ ప్రభుత్వంలోనే అనేక మద్యం బ్రాండ్లకు అనుమతులిచ్చారన్నారు. లేని కేసులపై కాకుండా నమోదైన కేసులపై విచారణ చేయగలరా అని ప్రశ్నించారు.